రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చెన్నైలో జరిగిన 'పుష్ప: ది రూల్' ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై చిత్ర నిర్మాత రవిశంకర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేవిశ్రీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమాలు చేస్తామని తెలిపారు. 'మా వాళ్లకి ప్రేమ ఉంటుంది. కానీ ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువయ్యాయని డీఎస్‌పీ అన్నారు. ఆయన అన్నదాంట్లో మాకేం తప్పు కనిపించలేదు' అని ఆయన అన్నారు.