‘ఇండియాస్ గాట్ లాటెంట్’కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రణవీర్ అల్లాబాదియా పోలీసుల ముందు హాజరయ్యారు. ఆయన వ్యాఖ్యలపై పలు కేసులు నమోదు అవడంతో రణవీర్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించగా అరెస్ట్ నుంచి బయటపడ్డాడు. అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మహారాష్ట్ర సైబర్ క్రైం విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపగా పోలీసుల ముందు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చాడు.