AP: ప్రముఖ సినీ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 25న విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఆర్జీవీకి వాట్సాప్ ద్వారా సీఐ శ్రీకాంత్ నోటీసులు పంపినట్లు సమాచారం. కాగా, ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆర్జీవీ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన బెయిల్ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.