నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, ఇంచార్జ్ డీపీఓ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.