మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన తెలుగు రాధాకృష్ణ (32) అనే యువకుడు మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలియజేశారు. డిచ్పల్లి ఎస్సై ఎండి షరీఫ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.