నవీపేట్: మొకంపల్లి గ్రామంలో సోమవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు పాల్గొని ఆడి పాడారు. మహిళలలో ఒకరు మాట్లాడుతూ దేవుని ప్రతి ఒక్క పూజలో పువ్వులను వాడుతుంటామని, కానీ మన సంస్కృతి ప్రకారం పువ్వులను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు.