నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్, చెంగల్, బాబాపూర్, పల్లికొండ గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్, కుంట శ్రీనివాస్ లు ఉన్నారు.