క్యూబాపై అమెరికా సామ్రాజ్యవాద నిరంకుశ తత్వానికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో పూలంగ్ చౌరస్తాలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ క్యూభా దేశంపై అమెరికా సామ్రాజ్యవాద నిరంకుశ తత్వం వలన ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టు మిట్టాడుతుందని, క్యూబాపై ఆంక్షలు విధిస్తూ అమెరికా చేస్తున్న నిరంకుశ తత్వాన్ని ఐక్యరాజ్యసమితి స్పందించి ఖండించాలని డిమాండ్ చేశారు.