నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామంలో జరుగుతున్న కుల గణన సర్వేను గురువారం మండల ప్రత్యేక అధికారి గోవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులంతా అధికారులు అడిగిన సమాచారాన్ని అందజేసి కుటుంబ సర్వేకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి అఖిలేష్ పటేల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.