వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిబ్బందికి సూచించారు. నవీపేట్ మండలంలోని అవంగపట్నం గ్రామంలో ఐకెపి, సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. రైస్ మిల్లులకు కాంటా చేసిన ధాన్యాన్ని విను వెంటనే పంపి రైతులకు సకాలంలో బిల్లులు అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో కొనుగోలు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.