నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాయిపేట్ లో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.