నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం నూతన విద్యార్థులకు స్వాగతం పలికేందుకు గాను ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీకి జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ హాజరైనారు. ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో మంచి ఫలితాలు సాధించే పేరున్న బాలికల జూనియర్ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి గాను మరింత ఉత్సాహంగా చదువుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని సూచించారు.