బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. శనివారం ఊట్పల్లి గ్రామానికి చెందిన భాదిత కుటుంబ సభ్యులు సురేష్ నాయక్ కు 54, 000, సుశీల కు 24, 000, ఆరిఫ్ మహమ్మద్ కు 12, 500 రూపాయల చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందించారు. అనంతరం రాజీవ్ నగర్ తండా కు చెందిన భాదితులకు చెక్కులను అందించారు.