బాల్కొండ: ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి, ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కల్యాణ లక్ష్మి కింద ఇచ్చే రూ. లక్ష ఇస్తున్నారే తప్ప.. తులం బంగారం ఇవ్వడంలేదని మండిపడ్డారు. తులం బంగారం ఎప్పుడిస్తారని సీఎం రేవంత్‌రెడ్డిని వేముల ప్రశ్నించారు.