గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్ ధర్నా చౌక్ లో ఒకరోజు సమ్మెను బుధవారం నిర్వహించారు. ఈ సమ్మెను సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, జంగం గంగాధర్ కు పూలమాలలు వేసి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో జీపీ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఏడాది కావస్తున్న పరిష్కారం చేయలేదని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.