భైంసా పట్టణంలోని వివేకానంద చౌక్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో ఘనంగా 162వ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో స్ధానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అనిల్ మాట్లాడుతూ హిందూతత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు వివేకానంద అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.