తానూర్ మండలం భోసీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న గంగాధర్ గత పది సంవత్సరాలుగా ప్లాస్టిక్ వాడకూడదని అవగాహన కల్పిస్తున్నారు. వచ్చే జనరేషన్లో ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఇవ్వాలని భూమిని ఇవ్వాలని ఆయన కోరారు. తన ఇరవై ఎకరాల భూమిలో ఎటువంటి కెమికల్స్ వాడకుండా పంటలు పండిస్తున్నారు. ఆదివారం మోటివేషన్ స్పీకర్స్ వాడేకర్ లక్ష్మణ్, తోట లక్ష్మణ్, రెడ్ల బాలాజీ ఆయనని కలిసి అభినందించారు.