సోన్ మండలంలోని కూచన్ పెల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం డ్రీమ్ సంస్థ ఆధ్వర్యంలో పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కో ఆర్డినేటర్ చిన్నయ్య మాట్లాడుతూ రసాయన కూరగాయలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, పోషకాహార కూరగాయలు తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉండడం జరుగుతుందని అన్నారు.