తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విధుల నుండి మినహాయించండని రాష్ట్ర సిఐటియు కార్యవర్గం ఆదేశాల మేరకు శుక్రవారం అంగన్వాడీ టీచర్స్ ముధోల్ తహసీల్దార్ శ్రీకాంత్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ పని ఒత్తిడి ఎక్కువగా కావడం వలన అంగన్వాడీ టీచర్స్ లను సమగ్ర ఇటింటి కుటుంబ సర్వేలో ఎన్యుమరేట్ విధులనుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.