వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

62பார்த்தது
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భైంసా పట్టణంలోని వారి నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మట్టి వినాయకుని ప్రతిష్టించి పూజించారు. ఈ సందర్భంగా మహా గణపతికి మంగళ హారతిని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు మహాగణపతి ఆశీస్సులు ఉండాలని, సుఖసంతోషాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி