వినాయకున్ని ప్రతిష్టించి 5, 9, 11 లేదా 21 రోజుల పాటు ప్రత్యేక పూజకు నిర్వహిస్తారు. కానీ నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని కుప్టి గ్రామంలో ఒక్క రోజు మాత్రమే ప్రతిష్టించి గ్రామస్తులంతా హారతి, ప్రత్యేక పూజలు చేసి మరుసటి రోజు ప్రత్యేక వాహనంపై గ్రామంలోని విధుల్లో ఉరేగించి గ్రామ చివర చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇలా ఒక్క రోజు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా అస్తుందని గ్రామస్తులు తెలిపారు.