కుంటాల మండలం కల్లూర్ విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాలకు మంగళవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని సబ్ ఇంజినీర్ మధు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన విద్యుత్తు లైన్ మరమ్మతుల నిర్వహణ కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.