రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు శనివారం డిమాండ్ చేశారు. నవంబర్ 26న దేశ వ్యాప్తంగా జరిగే ప్రజా, రైతు, కార్మిక నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కుబీర్ లో ప్రచారం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 13 నెలల ఢిల్లీ రైతు దిగ్బంధనం ముగింపు సందర్భంగా రైతాంగానికి ఇచ్చిన లిఖితపూర్వక హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.