కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో శుక్రవారం గ్రామస్తుల అధ్వర్యంలో తాళ సప్తాహం వేడుకలు అంగరంగ వైభవంగా
ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు తాళ సప్తాహ వేడుకలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులంతా కలిసికట్టుగా ఉంటూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఏడు రోజుల పాటు ఈ సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.