ఆర్జీయూకేటీ బాసర మెకానికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం బిట్స్ పిలానీ హైదరాబాద్ వేదికగా ఈనెల 22, 23న నిర్వహించిన ఆటోవన్ 24 రాష్ట్రస్థాయి పోటీలో రెండవ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ ఆదివారం విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో మెటీరియల్ సైన్స్ విభాగంలో “మెటీరియల్స్ టెక్నాలజీ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్”అనే పోస్టర్‌ను ప్రదర్శించారని వీసీ తెలిపారు.