ఆర్జీయూకేటీ బాసర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసర్చ్ చండీగఢ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యలో కృత్రిమ మేధస్సు అనే అంశంపై అవగాహన సదస్సు నేటితో ముగిసింది. ముగింపు సమావేశానికి వీసీ గోవర్ధన్ హాజరై మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు అంటేనే వినూత్నత అని నేడు ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్నటువంటి సేవా రంగంలో కృత్రిమ మేధస్సు పాత్ర ముఖ్య భూమిక వహిస్తుందని తెలిపారు.