ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు వరద నీరు కొనసాగుతుంది. గురువారం సాయంత్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టులోకి 5, 080 క్యూసెక్కుల వరద చేరగా ఒక గేటు ఎత్తి 4, 178 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. భారీగా వర్షాలు కురుస్తునందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.