
నల్గొండ: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మొట్ట మొదటిసారిగా నల్గొండ జిల్లాలో జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకుగాను డ్రైవర్లకు దాబాల వద్ద ఉచిత కంటి పరీక్షలతో పాటు, కళ్లద్దాల పంపిణీ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం వట్టిమర్తి రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా ఉచిత కంటి పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు.