కనగల్: ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం జరగకుండా చూడాలి

58பார்த்தது
కనగల్: ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం జరగకుండా చూడాలి
తేమ శాతం 17కు మించకుండా కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని అదేరోజు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం రాత్రి కురిసిన వర్షం వల్ల కనగల్ మండలం పొనుగోడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిందని తెలియగా ఆదివారం ఆమె పొనుగోడు కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా జాప్యం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி