నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరు గ్రామంలో మరణించిన మోహన్ రావు అనే అనాధకు గ్రామస్తులు దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. పేరూరు గ్రామంలో 30 సంవత్సరాలుగా ఉంటున్న మోహన్ రావు ఇంటింటికి తిరిగి అన్నం, డబ్బులు అడుక్కునేవాడని, అందరితో కలివిడిగా ఉంటూ అందరిని వరుసలు పెట్టి పిలిచేవాడని, గ్రామస్తులు తెలిపారు.