తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టియుడబ్ల్యూజే-ఐజేయూ) మునుగోడు నియోజకవర్గం అధ్యక్షుడిగా రాపోలు ప్రభాకర్ నియామకమైన సందర్భంగా శుక్రవారం చండూరు మార్కండేయ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆతనికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో యువజన సంఘం అధ్యక్షులు గంజి గంగాధర్, గౌరవ సలహాదారులు గంజి బిక్షం, గంజి అశోక్ కుమార్, మణికుమార్, కిరణ్ కుమార్, చిరంజీవి, రాఘవేంద్ర, రవి, భాస్కర్, సాయిరాం తదితరులు ఉన్నారు.