సూర్యాపేట: డిఈఓ కార్యాలయంలో కొనసాగుతున్న కౌన్సిలింగ్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఎస్సీ 20 24 సెలెక్టెడ్ అభ్యర్థుల కౌన్సిలింగ్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ప్రారంభమైంది. ఉదయం కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు తిరిగి పై అధికారుల ఆదేశాలతో మధ్యాహ్నం ప్రారంభించారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరిలో అనంతరం ఎస్జీటీల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు డిఈవో అశోక్ పేర్కొన్నారు.