భూముల మార్కెట్ విలువ పెంచాలనే ఆలోచన విరమించుకోవాలి: సతీష్ గౌడ్

1373பார்த்தது
భూముల మార్కెట్ విలువ పెంచాలనే ఆలోచన విరమించుకోవాలి: సతీష్ గౌడ్
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను ఏడునెలలు కాకముందే మరోసారి పెంచాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం దేవరకొండ నియోజకవర్గం నాయకులు చింతపల్లి సతీష్ గౌడ్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలోనే రెండోసారి మార్కెట్ విలువల సవరణ చేయడమనేది పనికిమాలిన చర్యఅన్నారు. ఇప్పటికే భూముల ధరలు ఆకాశనంటాయని, భూముల ధరలు పెరగడంతో సామాన్యుడు ఇంటి స్థలాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదని, మరోసారి భూముల విలువ పెంచితే పేద , మధ్యతరగతి ప్రజలు భూములు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో పునరాలోచించాలని, లేని పక్షంలో పేద ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி