దేవరకొండ పట్టణంలోని శ్రీ సాయి వైన్స్ వారు మద్యం బాటిళ్లను ఎంఆర్పి కంటే అధిక ధరలకు అమ్ముకోవడం జరుగుతుంది. యజమానులు అందరూ కలిసి సిండికేట్ అయి కమిషన్లకు అలవాటు పడి వేరే మార్గన మద్యం బాటిల్లను అధిక ధరలకు అమ్ముకోవడం జరుగుతుందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ వెంకటేశ్వర్లుకి గురువారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. వైన్స్ షాప్ యజమానులపై తక్షణమే చర్యలు తీసుకోవాలలి లేని పక్షంలో దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారి ఎత్తున్న ఆందోళన చేపడతామని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతపల్లి సతీష్ గౌడ్, తెలంగాణ విద్యార్థి సేన-జిల్లా అధ్యక్షులు రామావత్ సాయి నాయక్, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ జర్పుల జగన్ నాయక్ అన్నారు.