ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి మంచి మార్కులు సాధించారు. కొమ్మేపల్లి చెందిన అంకురి నరసింహ కుమార్తె అంకూరి మనీషా. ఇంటర్ బైపీసీలో 946. మార్కులు సాధించింది. ఈ సందర్భంగా సర్పంచ్ లోకసాని రజిని శ్రీధర్ రెడ్డి గ్రామపంచాయతీ దగ్గర విద్యార్థిని మనిషాను సన్మానించారు. విద్యార్థికి హార్దిక సాయం చేశారు. బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ యువజన జేఏసీ జిల్లా అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్. వంగూరి రాజు, తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, చింతపల్లి తిరుపతయ్య, లాలికోట చెన్నయ్య, అంకూరి నరసింహ, పద్మ, తాటికొండ శ్రీశైలం, వెంకటయ్య, సత్తనారి, తదితరులు పాల్గొన్నారు.