దేవరకొండ కొండమల్లేపల్లి పట్టణాల్లో వ్యాపార సముదాయలకు సంబంధించిన మడిగెలు చాలావరకు టూ -లెట్ బోర్డుతో కనిపిస్తున్నాయి. డిండి రోడ్డులో ఉన్న పలు మడిగెలు, షాపింగ్ కాంప్లెక్స్, కొండమల్లేపల్లిలో పలు షాపింగ్ కాంప్లెక్స్ లో టూ -లెట్ బోర్డ్స్ ఎక్కువుగా కనిపిస్తున్నాయి. దుకాణాల అద్దెలు ఎక్కువగా ఉండడంతోపాటు, ఆన్లైన్ కొనుగోళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తుంది.