దేవరకొండ పట్టణంలో ఈనెల 28వ తేదిన జరిగే బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం దేవరకొండలో మాట్లాడిన ఆయన బీసీలకు స్థానిక సంస్థల్లో 42%, చట్టసభలో రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై చర్చించనున్నామని, ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరవుతున్నట్లు తెలిపారు.