అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP కొల్లాపూర్ పట్టణంలో ఉన్న డిగ్రీ, జూనియర్ కళాశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం కొల్లాపూర్ నగర కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ అని సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త నిస్వార్ధంగా సమాజం కోసం పనిచేస్తూ, విద్యారంగ సమస్యల పట్ల అనేక ఉద్యమాలు చేస్తూ, విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ, సమాజ హితం కోసం దేశ హితం కోసం పనిచేసే సంస్థ ఏబీవీపీ అని సంస్థలో ఎవరికైనా ఒకే స్థానం ఉంటుందని, ప్రతి ఒక్కరూ సమాజం కోసం పనిచేయాలని కోరారు.