కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామంలోని గౌడ సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆదివారం జీల్లెళ్ళ గ్రామ గౌడ కులస్తులు హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే జి. జైపాల్ యాదవ్ గౌడ కులస్తుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లెల్ల గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.