నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పి సాయి రెడ్డి (78), మృతదేహాన్ని కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం సందర్శించారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సోదరులు వేధింపుల వల్లే మాజీ సర్పంచ్ పి. సాయి రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు.