హైదరాబాద్ మహా నగరానికి మూసీ నది ఒక వరమని, ఆ వరాన్ని మురికికూపంగా మార్చింది గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలేనని కేటీఆర్ అన్నారు. శనివారం నాగోల్‌లోని ఎస్టీపీ కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఎస్టీపీ ప్లాంట్ HYDలో ఉందని తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ఎస్టీపీతోనే ఇప్పుడు 20 కోట్ల లీటర్ల మురికినీరు శుద్ధి అవుతోందని తెలిపారు.