ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన వారసుడిగా రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీని నియమించినట్టు తెలుస్తోంది. ఇరాన్ అత్యంత రహస్యంగా ఈ ప్రకటన వెల్లడించినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 85 ఏళ్ల ఖమేనీ మరణానికి ముందే పదవీ విరమణ చేయనునుండగా.. త్వరలోనే మోజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 26న అసెంబ్లీ సభ్యుల సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.