ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ (58) దాదాపు 19 ఏళ్ల తర్వాత యూట్యూబర్ జేక్ పాల్‌తో ఫైట్‌లో పోటీపడ్డారు. ఈ ఫైట్‌ను OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసాదం చేసింది. ఆ మ్యాచ్‌ను చూసేందుకు ఒకేసారి 120 మిలియన్ల మంది యాప్‌లోకి వచ్చేశారు. దీంతో లోడ్ తట్టుకోలేక నెట్‌ఫ్లిక్స్ స్తంభించింది. దీనిపై యాజమాన్యానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.