మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ మంగళవారం సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. మందుల నిలువలు స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఏఎన్ఎంలకు సూచించారు.