మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అమృత్ 2. 0 పథకంలో భాగంగా పట్టణాభివృద్ధికి రూ. 12 కోట్ల నిధులు మంజూరు కావడంతో మంచినీటి సరఫరా నిర్మాణం నిమిత్తం రెండు వాటర్ ట్యాంకుల నిర్మాణానికి మంగళవారం మున్సిపల్ ఛైర్మన్ అశోక్ గౌడ్ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. మున్సిపల్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా త్వరలో ట్యాంక్ నిర్మాణం చేపడతామన్నారు.