మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని 10వ వార్డులోని నీటి పైప్ లైన్ ను, డ్రైనేజ్ లైన్ ఇబ్బందులను నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, వార్డు ఆఫీసర్ దుర్గయ్య, రాములు, సానిటేషన్ ఇన్స్పెక్టర్ సల్ల మురళి, వాటర్ సప్లై ఇన్స్పెక్టర్ వినీత్ రాజ్, జవాన్ ఎల్లం, కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.