మాసాయిపేటలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడల ముగింపు సమావేశానికి హాజరైన మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం ద్వారా శారీరక వికాసంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని వారు అన్నారు. మొదటి ద్వితీయ తృతీయ స్థానాలలో నిజామాబాద్, మెదక్, మంచిర్యాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు.