మెదక్ జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్ ప్రజల నుంచి సోమవారం వినతి పత్రాలు స్వీకరించారు. రైతుబంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు, పింఛన్లు మంజూరు చేయాలని, ప్రజలు అదనపు కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాసరావు, ఎల్లయ్య, ఆర్జిదారులు, తదితరులు పాల్గొన్నారు.