నవంబర్ 1 నుంచి మాథేరాన్‌ టాయ్‌ట్రైన్‌ సేవలు (వీడియో)

54பார்த்தது
మహారాష్ట్రలోని నేరల్‌-మాథేరాన్‌ మధ్య నడిచే టాయ్‌‌ట్రైన్‌ సేవలు నవంబర్‌ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. షెడ్యూల్‌ ప్రకారం, ఈ నెల 16 నుంచి సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా ఆకస్మిక వర్షాల కారణంగా వాయిదా పడినట్టు తెలిపారు. నేరల్‌-మాథేరాన్‌ మధ్య నడిచే టాయ్‌‌ట్రైన్‌ మార్గం 80% కొండ అంచుల మీదుగా ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య 21 కిలోమీటర్లే ఉన్నప్పటికీ రెండు గంటలపైనే సమయం పడుతుంది.

தொடர்புடைய செய்தி