ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు చేరుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు. దీంతో ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ విధించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 12.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 109 రన్స్ చేయగా.. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. కాగా, ట్రోఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.